తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనసాగుతోన్న ఏపీ రాజధాని ప్రజల ఆందోళనలు - 11వ రోజుకు చేరిన నిరసనలు

ఆంధ్రప్రదేశ్​ రాజధాని పరిధిలోని రైతులు.. ఆందోళనల నుంచి వెనక్కి తగ్గడం లేదు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పేంత వరకూ నిరసన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

capital-region-farmers-protests-reached-11th-day
రాజధాని ప్రజల ఆందోళన మంటలు

By

Published : Dec 28, 2019, 10:38 AM IST

అమరావతి పరిధిలోని గ్రామాల్లో... పదకొండో రోజూ ఉద్ధృతంగా రైతులు, ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో కమిటీ వేస్తారన్న వార్తలపై.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 29 గ్రామాల ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా.. ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని ప్రశ్నించారు.

ఎట్టి పరిస్థితుల్లో తమ పోరాటాన్ని ఆపేది లేదని.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. చట్టాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తమ త్యాగాలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని నిలదీశారు.

కొనసాగుతోన్న ఏపీ రాజధాని ప్రజల ఆందోళనలు

ఇదీ చూడండి: 'తిరంగ' ర్యాలీకి పోలీసుల నిరాకరణ.. చేస్తామంటున్న కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details