తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు... ఇవిగో మా ఆధార్​ కార్డులు' - తుళ్లూరు రైతుల ధర్నా

తమను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ... విమర్శిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్​ రాజధాని రైతులు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఆధార్ కార్డులు చేతపట్టుకొని ధర్నాలో పాల్గొన్నారు. తామంతా అమరావతి ప్రాంతానికి చెందినవారమని స్పష్టం చేశారు.

'మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు... ఇవిగో మా ఆధార్​ కార్డులు'
'మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు... ఇవిగో మా ఆధార్​ కార్డులు'

By

Published : Dec 31, 2019, 2:04 PM IST

నూతన సంవత్సరంలోనైనా తమకు న్యాయం జరిగేలా ఏపీ సీఎం జగన్ పాలించాలని అమరావతి రైతులు కోరారు. తుళ్లూరులో 14వ రోజుకు చేరుకున్న మహాధర్నాలో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అనే విమర్శలు తిప్పికొట్టేందుకు ఆధార్ కార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. తామంతా ఆంధ్ర రాజధాని ప్రాంతానికి చెందినవారమని స్పష్టం చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేయాలనే నినాదంతో ప్లకార్డులు దర్శనమిచ్చాయి. ప్రభుత్వానికి తాము భూములు ఇచ్చామని, తమ భవిష్యత్తు బాధ్యత కేంద్రం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని కోరారు. మూడు రాజధానులు వద్దని... అమరావతే ముద్దు అని నినదించారు.

'మేము పెయిడ్ ఆర్టిస్టులం కాదు... ఇవిగో మా ఆధార్​ కార్డులు'

ABOUT THE AUTHOR

...view details