BRS Candidates Election Campaign Telangana 2023 :రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ప్రచారాలను ముమ్మరం చేసి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజల్లోకెళ్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ప్రభుత్వ సంక్షేమ పథకాల మూలంగా మరోమారు అధికారంలోకి వస్తామని తార్నాక డివిజన్‌లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. పేదప్రజలకు పెద్దపీట వేయడమే తమ లక్ష్యమంటూ ప్రచారాన్ని కొనసాగించారు.
వరల్డ్ కప్‌లో ఇండియా - తెలంగాణలో కేసీఆర్ మూడో విజయం ఖాయం : కేటీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లో మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకు పోతున్నామని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్‌కు చెందిన నాయి బ్రాహ్మణులు, పలువురు మహిళా సంఘాల నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
CM KCR Assembly Elections Campaign 2023 : మరోవైపు జిల్లాల్లోనూ నాయకుల ప్రచారం జోరందుకుంది. బాన్సువాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశానని.. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి ఆశీర్వదించాలంటూ కోటగిరి మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు.
మాస్ లీడర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిబాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు.. వివిధ కుల సంఘాలకు చెందిన 622 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని ఆయా పార్టీలు మున్నూరు కాపులకు కేటాయించడం తమ ఘనతేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరు కాపు కుల సంఘం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.