తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ పరిధిలో యువకుడు అదృశ్యం - boy missing

స్వగ్రామానికి వెళ్లేందుకు రైలు ఎక్కడానికి వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ పరిధిలో యువకుడు అదృశ్యం

By

Published : Nov 19, 2019, 11:01 PM IST

స్వగ్రామానికి వెళ్లేందుకు రైలు ఎక్కడానికి వచ్చిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భోలక్​పూర్​లో నివాసం ఉండే రవి ఓజా అనే వ్యక్తి అల్లుడైన బినయ్ మిశ్రా బిహార్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులు ఇక్కడ గడిపిన అనంతరం బినయ్ మిశ్రా స్వగ్రామానికి వెళ్లేందుకు బయలుదేరాడు. అతని మామ ఓజా అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పంపాడు. రైల్వే స్టేషన్ వెళ్లిన బినయ్​ను అతనితోపాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు దానాపూర్ ఎక్స్​ప్రెస్​లో పంపినట్లు తెలిపారు.

రెండు రోజుల అనంతరం తన కొడుకును గురించిన సమాచారం కొరకు బినయ్ తల్లి ఓజాకు ఫోన్ చేసి అతను ఇంకా ఇంటికి చేరలేదని తెలిపింది. బినయ్​కు సంబంధించిన మిత్రులను, బంధువులను ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై రైల్వే ప్రభుత్వ పోలీసులకు ఓజా ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ పరిధిలో యువకుడు అదృశ్యం

ఇవీ చూడండి: పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

ABOUT THE AUTHOR

...view details