తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటులు, దంపతులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునె దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం స్వామివారి సేవలో తరించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి వారిని శేషవస్త్రంతో సత్కరించారు. రణ్‌వీర్, దీపికా.... రేపు ఉదయం అమృత్‌సర్‌కు వెళ్లి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించనున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ జంట - ranveer deepika latest news in tirumala
తిరుమల శ్రీనివాసుడిని ప్రముఖులు దర్శించుకున్నారు. బాలీవుడ్ జంట రణ్‌వీర్, దీపిక శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో రణ్‌వీర్, దీపిక దంపతులు
TAGGED:
Bollywood couple in tirumala