తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకోవడమే: బండి సంజయ్‌ - బండి సంజయ్​ వార్తలు

Bandi Sanjay On KCR: నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తే ఊరుకోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ హెచ్చరించారు. రేపు టీవీల్లో కేసీఆర్​ను చూసి ప్రజలు నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Mar 8, 2022, 10:50 PM IST

రేపు కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకోవడమే: బండి సంజయ్‌

Bandi Sanjay On KCR: సీఎం కేసీఆర్​ నిరుద్యోగులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బిస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. 25 లక్షల మంది నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నిరుద్యోగ భృతి నగదు జమచేయాలని డిమాండ్​ చేశారు. విద్యా వాలంటీర్లు, ఫీల్డ్​ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రేపు నిరుద్యోగులందరూ టీవీ చూడాలని కేసీఆర్ అంటున్నారని.. రేపు సీఎంను చూసి ప్రజలు నవ్వుకుంటారని బండి సంజయ్‌ అన్నారు.

సీఎం కేసీఆర్​కు కాషాయ సెగ తగిలే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్​పోల్స్​లో భాజపా గెలవబోతుందని తెలవడం వల్ల ప్రజల దృష్టిమరల్చేందుకే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాషాయ జెండా, హిందువు జోలికి రావొద్దని హెచ్చరించారు. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే.. మూసీ నదిలో కలుపుతామన్నారు. బంగారు తెలంగాణ అయిపోయిందని.. ఇక బంగారు భారత్ అంటూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు.

'5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ చూసి కేసీఆర్‌కు మతి భ్రమించింది. భాజపా గెలుపు నుంచి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారు. భాజపా ఉన్నంతకాలం పచ్చ జెండాలకు అవకాశం ఇవ్వం. రేపు అందరూ టీవీ చూడాలని కేసీఆర్ అంటున్నారు. రేపు కేసీఆర్‌ను చూసి ప్రజలు నవ్వుకోవడమే. నిరుద్యోగులను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేయొద్దు.' - బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details