BJP Leaders fires on cm kcr: కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాపాలనను గాలికొదిలేసి నియంత పాలన చేస్తున్నరని మండిపడ్డారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఏ పార్టీకి పోలింగ్ బూత్‌లు, శక్తి కేంద్రాలు లేవని పేర్కొన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడం వల్లనే 18 రాష్టాల్లో అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 80 శాతం మండల కమిటీలు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 119 నియోజకవర్గంలో బీజేపీకి పోటీ ఉందని.. దుబ్బాక హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనం అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు ఆగిపోతాయని, డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వరని అసత్య ప్రచారం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల రాజేందర్.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.