తెలంగాణ

telangana

ETV Bharat / state

'భైంసాలో ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి లేదు' - Muncipal election latest updates

భైంసాలో రాత్రి నుంచి నెలకొన్న పరిస్థితులపై భాజపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి పరిస్థితులపై దృష్టి సారించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు కమలం నేతలు విజ్ఞప్తి చేశారు.

indrasena reddy meet the election commissioner
ఈసీని కలిసిన ఇంద్రాసేనారెడ్డి

By

Published : Jan 13, 2020, 7:26 PM IST

Updated : Jan 13, 2020, 7:54 PM IST


భైంసాలో ఎన్నికల ప్రచారం చేసే పరిస్థితి లేదని... అక్కడ ఎన్నికలు వాయిదావేయాలని భాజపా నేతలు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసి విజ్ఞప్తిచేశారు. మాసబ్ ట్యాంక్​లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, భాజపా నేతలు కలిసి భైంసాలో జరుగుతున్న పరిస్థితిని వివరించారు.

తెరాస, కాంగ్రెస్, ఎం.ఐ.ఎం ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. భాజపా నేతను విత్ డ్రా చేసుకోవాలని తెరాస నేతలు భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని... తెరాస ఎం.ఐ.ఎంను పాముకు పాలు పోసి పెంచినట్లు పెంచుతోందని ఇంద్రసేనా రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

భైంసా పురపోరుపై ఇంద్రాసేనారెడ్డి ఫిర్యాదు

ఇవీ చూడండి: వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా

Last Updated : Jan 13, 2020, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details