తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2020, 5:33 PM IST

ETV Bharat / state

కొంచెం కొత్తగా: కేసీఆర్​ 66వ బర్త్​డేకు 566 మంది కవలల​తో విషెస్​​...

గులాబీ అధినేత కేసీఆర్​ 66 వ జన్మదినానికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు సేవ్​ సొసైటీ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 66 సంఖ్యను ఆధారంగా చేసుకుని కొంచెం కొత్తగా విషెస్​ చెప్పేందుకు ప్లాన్​ చేసుకున్నారు. ఈ నెల 16 న 566 మంది కవలలతో 66 కొవ్వొత్తులు, 666 హీలియం బెలూన్స్​, 566 మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

BIRTHDAY WISHES TO KCR BY 566 TWINS IN HYDERABAD
BIRTHDAY WISHES TO KCR BY 566 TWINS IN HYDERABAD

సీఎం కేసీఆర్‌ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న 566 మంది కవలలతో సేవ్‌ సోసైటీ స్వచ్ఛంద సంస్థ 2కె రన్‌ నిర్వహిస్తోంది. రవీంద్రభారతి నుంచి లలితా కళాతోరణం వరకు జరిగే పరుగును మంత్రి శ్రీనివాస్​గౌడ్‌ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా 66 కిలోల కేక్‌తో పాటు 66 కొవ్వొత్తులు, 566 మొక్కలు నాటి, 666 హీలియం బెలూన్స్‌ ఎగరవేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్​ సోదరులు, రామ్​-లక్ష్మణ్​ ఫైట్​ మాస్టర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని నిర్వహకులు తెలిపారు. 2కె రన్​లో పాల్గొనాలనుకునే వారు 9121066647 నంబర్‌కి ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఏప్రిల్​ 26న నెక్లెస్​ రోడ్డులో 5066 మంది కవలలో ట్విన్​ సీటీ- ట్విన్స్​ కార్నివాల్​ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవలలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... వారికి చేయూతనిచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సేవ్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

కేసీఆర్​ 66వ బర్త్​డేకు 566 మంది ట్విన్స్​తో విషెష్​...

ఇదీ చూడండి:అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్తే.. రాళ్లతో దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details