బైక్ పోయింది :
రక్షక భటుల నిలయంలోనే రక్షణ లేకపోతే!
ఏదైనా పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ... పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనమే చోరీ అయితే ఎవరికి చెప్పాలి? రక్షక భటుల నిలయానికే రక్షణ లేకుండా పోతే ఇక సాధారణ ప్రజల సంగతేంటి?
పోలీస్ స్టేషన్లో బైక్ చోరీ
అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగిన యువకుడు చివరగా టోలీచౌకీ ఠాణాలో సంప్రదించగా... ఆ ద్విచక్ర వాహనం పోయిందని... దొరికితే ఇస్తామని పోలీసులు సమాధానం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించామని చెబుతున్నారు. తన బైక్ ఇవ్వడం లేదని యువకుడు ఆవేదన చెందాడు. రోజు ఉద్యోగానికి ద్విచక్రవాహనంపై వెళ్లేవాడినని, ఇప్పుడు బైక్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని తెలిపాడు.
ఇవీ చూడండి:ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ