గతేడాది ఇంటర్ బోర్డులో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఆరు ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేసిన ప్రభుత్వం... ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు రూపొందించిన బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ గ్రీవెన్స్ రెడ్సెల్ సిస్టంను విద్యశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు.
"ఇకపై ఆన్లైన్లోనే 'ఇంటర్' సమస్యల పరిష్కారం" - ఇంటర్ విద్యార్థుల సమస్యల కోసం బీఐజీఆర్ఎస్
ఇకపై ఇంటర్ బోర్డులో తప్పిదాలు జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులను కొత్త సీఎస్ సోమేశ్ కుమార్ హెచ్చరించారు. ఇంటర్ బోర్డు నూతనంగా రూపొందిన బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ గ్రీవెన్స్ రెడ్సెల్ సిస్టంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
!["ఇకపై ఆన్లైన్లోనే 'ఇంటర్' సమస్యల పరిష్కారం" BIGRS Solve for Intermediate Student problems in Telangana state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5623579-907-5623579-1578382555255.jpg)
ఇంటర్ పరీక్షలు రాయబోయే సుమారు 10 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బీఐజీఆర్ఎస్ ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. సుమారు 30 నుంచి 40 రకాల సమస్యలను పరిష్కరించే దిశగా తయారు చేసిన ఈ గ్రీవెన్ సెల్ ద్వారా విద్యార్థులు ఒక రోజులోనే తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అలాగే ఈ బీఐజీఆర్ఎస్లో బాధ్యులైన అధికారులు, కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకుల అవగాహన కోసం ప్రత్యేక బుక్ లెట్ ముద్రించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'