తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యాన్నదానంతో పేదల ఆకలి తీరుస్తున్న కార్పొరేటర్​ - FOOD DISTRIBUTION IN HYDERABAD

హైదరాబాద్​లోని బేగంబజార్​ కార్పొరేటర్​ శంకర్​యాదవ్ నిత్యన్నదానంతో పేదల ఆకలి తీరుస్తున్నారు. లాక్​డౌన్​ ప్రారంభమైన రోజు నుంచి అన్నదానంతో పాటు బస్తీవాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.​

BEGUMBAZAR CORPORATER DISTRIBUTION FOOD DAILY TO POOR
నిత్యాన్నదానంతో పేదల ఆకలి తీరుస్తున్న కార్పొరేటర్​

By

Published : Apr 16, 2020, 2:06 PM IST

హైదరాబాద్​లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు పలువురు రాజకీయ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమవంతు సాయం చేస్తున్నారు. బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ప్రతీ రోజు నిత్యవసర సరుకుల పంచుతూ, భోజనాలు పెడుతున్నారు.

ప్రధాని మోదీ పిలుపు మేరకు గత నెల 23 నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో నిత్యం అన్నదానంతో పాటు... తమ డివిజన్​లోని అన్ని బస్తీల్లోని పేదలకు నిత్యావసర సరుకులు పంచిపెడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని శంకర్​యాదవ్​ కోరారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details