ఆదివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీ శంషీర్‌గంజ్ ప్రాంతంలోని సిండికేట్ బ్యాంక్లోనికి అక్రమంగా వెళ్తున్న ముగ్గురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు గమనించారు. పోలీసులు దగ్గరకు వెళ్తుండగా అప్రమత్తమైన ఆ ముగ్గురూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకున్నారు.
ఆ ముగ్గురిని విచారించగా సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి వచ్చినట్లు తెలిపారు. గతంలో నిజాం మ్యూజియంలో దొంగతనం చేసిన నిందితుల్లోని మొబిన్ వీరిలో ఒకడు.
దొంగతనానికి వచ్చిన నిందితుల్లో మొబీన్, కాసిమ్ అలీ, సాజిద్‌లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గ్యాస్ కట్టర్, చోరీకి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏటీఎంకు కన్నమేశారు..అడ్డంగా దొరికారు... - దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు అరెస్టు
బ్యాంక్ ఏటీఎంలో చోరీకి పాల్పడుతుండగా రెడ్ హ్యండెడ్‌గా ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్న వైనం హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పీస్ పరిధిలో చోటు చేసుకుంది.
చోరీకి యత్నించారు.. ముగ్గురు అడ్డంగా దొరికారు
ఇదీ చూడండి: రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు