కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినేందుకు వీలుగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు గతంలో ప్రభుత్వం ఇస్తున్న తరహాలో వాహనాల కొనుగోలు సహా ఇతర అవసరాల కోసం కూడా ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించనుంది. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకూ ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇప్పించేలా చూడాలని ఉద్యోగసంఘాల ఐకాస.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్పై సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఇంకా ఉద్యోగుల పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం త్వరలోనే రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. -ఎం.రాజేందర్, ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడు