అపోలో ఆస్పత్రిలో చేరిన దత్తాత్రేయ - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ
11:36 March 09
అపోలో ఆస్పత్రిలో చేరిన బండారు దత్తాత్రేయ
భాజపా సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిన దత్తాత్రేయకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయం వెళ్తుండగా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జాయింట్ డైరెక్టర్ సంగీతా రెడ్డి వెల్లడించారు. ఆయన సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు.
TAGGED:
బండారు దత్తాత్రేయ