రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో ట్రాఫిక్ పోలీసులు... విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసీపీ రంగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన - Awareness of students on the prevention of road accidents at Secunderabad
దిల్లీ పబ్లీక్ స్కూల్ సెయింట్ ఆండ్రూస్ పాఠశాలలో ట్రాఫిక్ పోలీసులు... విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
![రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన Awareness of students on the prevention of road accidents at Secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5916258-471-5916258-1580529262470.jpg)
రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీపీ సూచించారు. సీటు బెల్టు, లైసెన్సు కలిగి ఉండాలని అతివేగం వల్లే ప్రమాదాలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వారితో ముఖాముఖి ఏర్పాటు చేసి వారి సందేహాలను తీర్చారు. రేపటి వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరగనున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ఇదీ చూడండి: టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం... రోడ్డుపై పడ్డ 20 కుటుంబాలు