జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన ఒక్కో కౌంటింగ్ హాల్ ఉంటుంది.
ఒక్కో కౌంటింగ్ హల్‌లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి సహా ఒక్కో పరిశీలకుడిని నియమించారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారికి రిలీవింగ్ సౌకర్యం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత రెగ్యులర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టనుండగా... తొలుత పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు.