జీహెచ్ఎంసీ రహమత్నగర్ డివిజన్ను ఆదర్శంగా తీర్చదిద్దుతానని తెరాస అభ్యర్థి సీఎన్ రెడ్డి అన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా: సీఎన్ రెడ్డి - హైదరాబాద్ తాజా సమాచారం
గ్రేటర్ ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రహమత్నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి సీఎన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. భారీ విజయం అందించిన ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కరిస్తానని ఆయన అన్నారు.
'ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా'
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రహమత్నగర్ను అభివృద్ధిపథంలో నడిపిస్తానని ఆయన తెలిపారు. మురికివాడగా పేరున్న డివిజన్లో రాబోయే ఐదేళ్లలో సమస్యలన్నీ పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని సీఎన్ రెడ్డి వెల్లడించారు.