తెలంగాణ

telangana

ఆంధ్రప్రదేశ్​లో మరో 11 జాతీయ రహదారులు

By

Published : Mar 5, 2021, 12:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లో మరో 11 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల హోద లభించింది. వీటిలో అయిదింటికి నంబర్లూ కేటాయించారు. ఆయా రహదారులకు వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.

another-11-national-highways-in-andhra-pradesh
ఆంధ్రప్రదేశ్​లో మరో 11 జాతీయ రహదారులు

ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రహదారులుగా ఉన్న 11 మార్గాలకు జాతీయ రహదారుల హోదా లభించింది. మొత్తంగా 766.59 కిలోమీటర్ల పొడవైన రోడ్లు జాతీయ రహదారుల జాబితాలో చేరాయి. వీటిలో అయిదింటికి నంబర్లు కేటాయించారు. మిగిలిన ఆరు రహదారుల పూర్తి వివరాలు ఇస్తే వాటికీ నంబర్లు ఇవ్వనున్నారు.

ఆయా రహదారులకు కన్సల్టెంట్‌ సంస్థల ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయించి... డీపీఆర్‌లు సిద్ధమైన తర్వాత వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 11 రహదారుల్లో.. 3 మినహా మిగిలినవన్నీ రాయలసీమ పరిధిలో ఉన్నాయి. ఆయా రహదారుల్లో వాహన రద్దీ తదితరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు వరుసలు చేయలా, ఉన్నదాన్ని 10 మీటర్లకు విస్తరిస్తే సరిపోతుందా? అనేది పరిశీలిస్తారు.

ఇదీచూడండి:ఏపీలో ప్రశాంతంగా బంద్‌.. రోడ్డెక్కిన కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు

ABOUT THE AUTHOR

...view details