తెలంగాణ

telangana

ETV Bharat / state

శతోత్సవం: వేడుకగా ఏఐటీయూసీ వందో వార్షికోత్సవం - ఏఐటీయూసీ

అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) శత వార్షికోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

'హిమాయత్‌నగర్‌లో ఘనంగా ఏఐటీయూసీ శత వార్షికోత్సవం'

By

Published : Oct 31, 2019, 11:32 PM IST

'హిమాయత్‌నగర్‌లో ఘనంగా ఏఐటీయూసీ శత వార్షికోత్సవం'

హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) శత వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏఐటీయూసీ భవనం ఎదుట యూనియన్ ప్రధాన కార్యదర్శి బోసు జెండాను ఆవిష్కరించారు. ఈ వంద సంవత్సరాల్లో కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి... ఎన్నో డిమాండ్లను సాధించుకున్న చరిత్ర ఏఐటీయూసీకి ఉందని బోసు పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నాడు దేశ ప్రగతి కోసం ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేస్తే... నేడు కార్పొరేట్ సంస్థల ప్రగతి కోసం ప్రభుత్వరంగ సంస్థలను పాలకులు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి... సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details