రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయ సాధనకు యువత కంకణబద్ధులు కావాలని శాసనసభ్యులు ముఠా గోపాల్ సూచించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషిచేద్దాం' - AMBEDKAR Birthday celebrations in Musheerabad
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడకులకు స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషిచేద్దాం
కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. లాక్డౌన్ మే 3 వరకు పొడిగించినందున ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:మోదీ 'లాక్డౌన్ 2.0' స్పీచ్ హైలైట్స్