తెలంగాణ

telangana

ETV Bharat / state

లోక్​సభ ఎన్నికలకు సిద్ధం - VOTER LIST

గత అనుభవాల దృష్ట్యా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఈసీ పేర్కొంది.

ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్​ల వినియోగం పై అవగాహన సదస్సు

By

Published : Mar 2, 2019, 6:14 AM IST

ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు సరిగ్గానే పనిచేస్తున్నాయని, వీటిపై అపోహలు అక్కర్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ, సంబంధిత అంశాలపై ఈసీ హైదరాబాద్​లో కార్యశాల నిర్వహించింది.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్​ల వినియోగం, చెల్లింపు వార్తలు, ఐటీ అప్లికేషన్స్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఖర్చులపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని అధికారులు తెలిపారు.

శాసనసభ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల నిర్వహణలో విరివిగా వినియోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి అమ్రపాలి తెలిపారు.

లోక్​సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం : ఈసీ

ABOUT THE AUTHOR

...view details