తెలంగాణ

telangana

ETV Bharat / state

'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు'

రాష్ట్రంలో సచివాలయ కూల్చివేతను నిలిపివేయాలని అఖిలపక్ష నేతలు గవర్నర్​ను కలిసి విన్నవించుకున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ సరైన చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

By

Published : Jul 15, 2019, 8:02 PM IST

'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు'

సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను అఖిలపక్ష నేతలు కోరారు. సెక్షన్ 8ప్రకారం గవర్నర్‌కు ఆస్తులను కాపాడే అధికారం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను అఖిలపక్ష నేతలు కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తదితరులు ఉన్నారు. పాతవి కూల్చి కొత్తవి కట్టడంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని గవర్నర్‌కు వివరించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ స్పందించకుంటే... అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తడతామని నేతలు పేర్కొన్నారు.

'కూల్చివేతలపై గవర్నర్​ను కలిసిన అఖిలపక్ష నేతలు'

ABOUT THE AUTHOR

...view details