మద్యం సేవించి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం బస్తీలో నివసించే రాము పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం మూసాపేట జనతానగర్లోని భవాని మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. ఆ దుకాణం సిట్టింగ్ రూములో మద్యం సేవించాడు. సాయంత్రం రాము దుకాణం ఎదురుగా మృతి చెంది ఉన్నట్లు సమాచారం.
మద్యం తాగి.. అదే దుకాణం ముందు మృతి? - మద్యం తాగి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన
మద్యం తాగి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వ్యక్తి మృతికి మద్యం దుకాణదారులే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు.
మద్యం తాగి.. అదే దుకాణం ముందు మృతి?
విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, రాముని మృతికి మద్యం దుకాణం వారే కారణమంటూ బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. కాగా మృతుడు అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు?