ETV Bharat / state

రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు? - Who are the eligible farmers in the telanagana state?

రుణమాఫీ అమలుదిశగా  రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అర్హులైన రైతులు ఎందరో లెక్కతేల్చాలని బ్యాంకర్లను కోరింది. లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేస్తే... ఎన్ని నిధులు అవసరమవుతాయో తెలపాలని సర్కారు ఆదేశించింది.

who-are-the-eligible-farmers-in-the-telanagana-state
రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు?
author img

By

Published : Jan 9, 2020, 5:33 AM IST

Updated : Jan 9, 2020, 8:29 AM IST

ఏడాది కాలంగా కర్షకులు ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2018 డిసెంబరు 11 లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రుణమాఫీకి ఎంతమంది రైతులు అర్హులో లెక్కలు తేల్చేందుకు సర్కారు సిద్ధమైంది.

రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులెందరు?

35 లక్షల రైతు కుటుంబాలు

రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, ఇందుకు చెల్లించాల్సిన నిధులెన్ని అనే వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఎస్​ఎల్​బీసీని సర్కారు ఆదేశించింది. పీఎం కిసాన్ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తున్న వివరాల ఆధారంగా... రాష్ట్రంలో దాదాపుగా 35లక్షల రైతు కుటుంబాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. కుటుంబంలో ఒకరికే మాఫీ చేయాలా... లేదా... అందరికీ ఇవ్వాలా అనేది సీఎం నిర్ణయించనున్నారు. కుటుంబానికి ఒకరికే అనే ప్రాతిపదిక తీసుకుంటే నిర్థేశిత గడువు తేదీ నాటికి 28వేల కోట్ల రూపాయల వరకూ బకాయిలు ఉండవచ్చని ప్రాధమిక అంచనా. ప్రతి ఒక్కరికీ చెల్లించాలంటే నిధులు 32 వేల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు.

4 విడతలుగా...

గతంలో మాదిరిగా మొత్తం నాలుగేళ్లపాటు 4విడతలుగానే రుణా మాఫీ డబ్బులు అందే అవకాశాలు ఉన్నాయి. కొత్త బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కాగా... రుణమాఫీ పథకం కింద సొమ్ము బ్యాంకుల్లో నేరుగా జమ సేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. గతంలో బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురిచేశారని భావిస్తున్న ప్రభుత్వం... ఈసారి ప్రతి రైతుకు చెక్కు రూపంలో అందజేసే విషయాన్ని పరిశీలిస్తోంది.

మాఫీ చేస్తారా?

గత అక్టోబరు 1 నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న రుణాలను వ్యవసాయ పంట రుణాల జాబితాలో చూపవద్దని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ, రుణమాఫీ పథకం 2018 డిసెంబరు 11 నాటికి ఉన్న బకాయిలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. అప్పటికీ బంగారం తాకట్టు రుణాలు.. పంట రుణాల జాబితాలోనే ఉన్నాయి. వాటిని ఇప్పటి నిబంధనల ఆసరాగా జాబితా నుంచి తొలగిస్తారా... లేక మాఫీ చేస్తారా... అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది.

ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?

09-01-2020 TG_HYD_01_09_DEBT_WAIVE_FARMERS_CALCULATIONS_PKG_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) రాష్ట్రంలో రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల లెక్కలు తేల్చేపనిలో సర్కారు పడింది. ఏడాది గడిచిన నేపథ్యంలో రైతుల నుంచి ఒత్తిడి వస్తున్న దృష్ట్యా... అసలు రుణమాఫీకి అర్హులైన రైతులెందరు...? ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున రద్దు చేస్తే... ఎంత మొత్తం కావాలి...? అన్న అంశాలపై విస్తృతంగా విశ్లేషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మోన్ యోజన లబ్ధిదారుల ఆధారంగా గుర్తించేందుకు సిద్ధమైంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణాలు ఇచ్చారా...? లేదా పంట పరిమితికి మించి రుణం తీసుకున్నారా...? తేల్చేందుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం... బ్యాంకర్లను కోరింది. LOOK........... VOICE OVER - 1 రైతులకు శుభవార్త. ఏడాదికాలంగా కర్షకులు ఎదురు చేస్తున్న రుణమాఫీ పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. వాస్తవానికి ఈ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం ఎన్నిక నిధులు ఇవ్వాలనే లెక్క ఇంత వరకూ ఎక్కడా లేదు. అసలు ఎందరు రైతులు అర్హులు, అందుకు చెల్లించాల్సిన నిధులెన్ని అనే వివరాలు సమగ్రంగా ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి - ఎస్‌ఎల్‌బీసీని సర్కారు ఆదేశించింది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రలో వ్యవసాయ పంట రుణం తీసుకున్న రైతులకు 1 లక్ష రూపాయలు వరకూ మాఫీ చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. 2018 డిసెంబరు 11 వరకూ లక్ష రూపాయల వరకూ రుణం తీసుకున్న రైతు కుటుంబాలకు ఈ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గతంలో ప్రకటించారు. ఈ పథకం అమలు కావాలంటే తొలుత పక్కాగా లెక్కలు తేల్చాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువు తేదీ 2018 డిసెంబరు 11 నాటికి ఎంత మంది రైతులు లక్ష రూపాయలు వరకూ బకాయి ఉన్నారనే లెక్కలు పక్కాగా ఇవ్వాలని తాజాగా ఒక నమూనా ప్రశ్నావళిని తయారు చేస్తోంది. ఒక కుటుంబంలో ఎందరు రైతులు ఉన్నారు...? ఎవరి పేరిట ఎంత బాకీ ఉంది...? బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని...? పంట కోసం తీసుకున్నది ఎంత...? తదితర వివరాలు అడిగింది. కేంద్రం... రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో వేస్తోంది. రుణమాఫీకి కూడా పీఎం కిసాన్‌ వివరాలనే ఆధారంగా తీసుకున్నారు. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో కాస్త అటు, ఇటుగా 35 లక్షల రైతు కుటుంబాలుఉన్నట్లు వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది. పౌరసరఫరాల శాఖ ఇచ్చిన రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబాలను గుర్తించనున్నారు. కుటుంబానికి ఒకరికే చేయాలా లేక ప్రతి ఒక్కరికీ ఇవ్వాలా అనేది సీఎం నిర్ణయిస్తారు. దీనికోసం లెక్కలు విడిగా తయారు చేస్తున్నారు. కుటుంబానికి ఒకరికే అనే ప్రాతిపదిక తీసుకుంటే నిర్థేశిత గడువు తేదీ నాటికి 28 వేల కోట్ల రూపాయల వరకూ బకాయిలు ఉండవచ్చని ప్రాధమిక అంచనా. ప్రతి ఒక్కరికీ చెల్లించాలంటే నిధులు 32 వేల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. రైతుల సంఖ్యపై ఎలాంటి స్పష్టతలేదు. పభుత్వం ఏ విధంగా చెల్లించాలనేది నిబంధన ఖరారుచేస్తేనే రైతుల లెక్క తేలనుంది. VOICE OVER - 2 రుణమాఫీ పథకం కింద సొమ్ము బ్యాంకుల్లో నేరుగా జమ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. గతంలో 2014లో ఇలా చేసినప్పుడు బ్యాంకులు రైతులను సతాయించాయని ప్రభుత్వం భావిస్తోంది. గత రుణమాఫీ అమలు అనుభవాల నేపథ్యంలో రైతుల వివరాలు, చెల్లించాల్సిన బకాయిల లెక్కలు తేలిన తర్వాత ప్రతి రైతు చెక్ రూపంలో అందజేస్తే ఎలా ఉంటుందనే అంశాలపై విస్తృత చర్చ సాగుతోంది. గతంలో మాదిరిగా మొత్తం నాలుగేళ్లపాటు నాలుగు విడతలుగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే కొత్త రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ కేటాయింపులు బట్టి రైతులకు ఎంత ఇస్తారనేది తేలుతుంది. గత అక్టోబరు 1 నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న రుణాలను వ్యవసాయ పంట రుణాల జాబితాలో చూపవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు - ఆర్‌బీఐ... బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ, రుణమాఫీ పథకం 2018 డిసెంబరు 11వ తేదీ నాటికి ఉనన బకాయిలకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. అప్పటికీ బంగారం తాకట్టు రుణాలు పంట రుణాల జాబితాలోనే ఉన్నాయి. కానీ, వాటిని ఇప్పటి నిబంధనల ఆసరాగా ఆ జాబితాలో నుంచి తొలగిస్తారా లేక మాఫీ చేస్తారా అని ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని బ్యాంకర్లు వివరించారు. ఒకవేళ వాటిని తొలగిస్తే 5 వేల కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వానికి భారం తగ్గుతుందని అంచనా. ప్రతి పంటకు ఎంత రుణం ఇవ్వాలనేది ఏటా ఏప్రిల్‌లో ఎస్‌ఎల్‌బీసీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ణయిస్తుంది. FINAL VOICE OVER రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి రైతులకు ఈ పరిమితి ప్రకారమే తీసుకున్నారా...? లేదా ఎక్కువ తీసుకున్నారా...? అనే వివరాలపై సర్కారు ఆరా తీస్తుంది.
Last Updated : Jan 9, 2020, 8:29 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.