తెలంగాణ

telangana

ETV Bharat / state

'పురపాలక ఎన్నికల పోలింగ్​​ కోసం పటిష్ఠ భద్రత'

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల కోసం 50వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్ తెలిపారు. ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో సీనియర్ పోలీస్ అధికారిని బాధ్యుడిగా నియమించినట్లు ఆయన తెలిపారు.

adg jitender
'పురపాలిక పోలింగ్​​ కోసం పటిష్ఠ భద్రత'

By

Published : Jan 21, 2020, 10:33 PM IST

తెలంగాణ వ్యాప్తంగా పురపాలిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్​ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం ఎక్సైజ్, అటవీశాఖలకు చెందిన సిబ్బందిని పహారాకు వినియోగించుకుంటున్నట్లు జితేందర్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకింద 131 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేయకుండా నిఘా ఏర్పాటు చేశామన్నారు.

రూ.51 లక్షలకు పైగా స్వాధీనం

తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.51లక్షల 36వేల నగదు, 21లక్షల 22వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జితేందర్ తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 1,122 కేసులు నమోదు చేసి 4,969మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. లైసెన్స్ కలిగిన 1,745 ఆయుధాలను ఠాణాలలో డిపాజిట్ చేయించున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు... ఓటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు డీజీపీ జితేందర్ కోరారు.

ఇదీ చూడండి: ఒక్క టెండర్ ఓటు నమోదైనా రీపోలింగ్: నాగిరెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details