లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అడ్డగుట్ట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో అడ్డగుట్ట వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 800 మందికి కూరగాయాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మారేడుపల్లి ఎమ్మార్వో సునీల్ పాల్గొన్నారు.
ఆదుకుంటున్న అడ్డగుట్ట వెల్ఫేర్ అసోసియేషన్
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం నిరుపేదలకు సాయం చేసేందుకు అడ్డగుట్ట వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన అడ్డగుట్ట ప్రాంతంలో 800 మందికి కూరగాయల పంపిణీ చేసింది.
ఆదుకుంటున్న అడ్డగుట్ట వెల్ఫేర్ అసోసియేషన్
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో ఎవరికి వారు తమవంతుగా పేదలకు సహాయం చేయాలని ఎమ్మార్వో సునీల్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!