హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ నిర్వహించేందుకు ప్రయత్నించిన ఫై పబ్‌పై పోలీసులు దాడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అశ్లీల నృత్యాలు చేసేందుకు వచ్చిన 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో 20 మంది పోలీసులు.... రెండు బృందాలుగా విడిపోయి దాడి చేశారు. యువతులను తీసుకువచ్చిన నిర్వాహకుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నగరంలోని పబ్ నిర్వాహకులు ఈ తరహా రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస రావు హెచ్చరించారు.
'రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు' - ఏసీపీ శ్రీనివాస రావు
రేవ్‌పార్టీ నిర్వహించేందుకు సిద్దమైన ఫాయి పబ్‌పై పోలీసుల దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు వచ్చిన 21 మంది యువతులను అదుపులోకి తీసుకుని... పబ్ నిర్వాహకుడు ప్రసాద్ కోసం గాలిస్తున్నారు.
'రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు'