లాక్డౌన్ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
లాక్డౌన్ సమయంలో పనులు వేగవంతం - MLA Sudheer Reddy meeting
ఎల్బీనగర్ నియోజకవర్గం నందు అభివృద్ధి విషయంలో పెద్ద మార్పులు చూస్తారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పలు అభివృద్ధి పనుల గురించి మాస్టర్ ప్లాన్ అధికారులచే ఆయన కొత్తపేటలో సమీక్ష సమావేశం జరిపారు.
లాక్డౌన్ సమయంలో పనులు వేగవంతం
నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు అడ్డంగా ఉన్న సుమారు 60 కట్టడాలను కూలగొట్టడం జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు గత 15 రోజులుగా అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రణాళికలతో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఇదీ చూడండి :'పొద్దుపోకుంటే యోగా చేస్కోండి.. ఆరోగ్యానికి మంచిది'