తెలంగాణ

telangana

ETV Bharat / state

సిపాయిని ముంచిన దంపతులు... మనస్తాపంతో మృతి - hyderabad ccs police

సికింద్రాబాద్ కార్ఖానాలో నివాసం ఉంటున్న ఓ సిపాయికి... విలువైన బహుమతులు వచ్చాయంటూ ఓ జంట నిలువు దోపిడీ చేసింది. మోసాన్ని గ్రహించిన బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు చిక్కిన... చీటర్స్ కపుల్

By

Published : Nov 22, 2019, 8:43 AM IST

Updated : Nov 22, 2019, 2:03 PM IST

దిల్లీ కేంద్రంగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న దంపతులను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతులు మోసం చేయడం వల్లే... సైన్యంలో పనిచేసే సిపాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. దిల్లీకి చెందిన లోకేంద్ర సింగ్‌, రుచిసింగ్‌ డెల్తాన్‌ ఆన్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. తమ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తే కారు బహుమతిగా ఇస్తామంటూ ప్రకటనలు గుప్పించారు.
సికింద్రాబాద్‌ కార్ఖానాలో నివసించే సిపాయి విలాస్‌ మధుకర్‌ను లక్ష్యంగా చేసుకున్న దంపతులు అతనికి విలువైన బహుమతులు వచ్చాయంటూ తొంభై వేల రూపాయలను కొల్లగొట్టారు. బహుమతులు రాకపోయే సరికి మోసపోయినట్టు గ్రహించిన విలాస్‌... తన డబ్బులు రాబట్టుకోవాలని విఫలయత్నం చేశాడు. డబ్బులు వెనక్కి రాకపోవడం వల్ల ఉరేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. పోలీసులు మొదట అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. సైనిక అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం లోతుగా విచారణ జరిపి నేర దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి : ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం

Last Updated : Nov 22, 2019, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details