తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి.. అలా మాట్లాడొచ్చా?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైద్యులపై చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జేపీ నడ్డా..కరోనాపై పోరాడుతోన్న వైద్యులను అవమానపరిచేలా మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

By

Published : Jun 21, 2020, 6:40 PM IST

దేశ వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి.. అలా మాట్లాడొచ్చా?
దేశ వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసి.. అలా మాట్లాడొచ్చా?

రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిపై భార‌తీయ జ‌నతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ‌ మంత్రి హ‌రీష్‌రావు తీవ్రంగా స్పందించారు. జేపీ న‌డ్డా వ్యాఖ్య‌లను త‌ప్పుబ‌డుతూ మంత్రి హ‌రీష్‌రావు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. స‌రిహ‌ద్దుల్లో దేశ ర‌క్ష‌ణ కోసం పోరాడుతున్న సైనికులు, తమ ప్రాణాలను సైతం లెక్క చేయ‌కుండా కరోనాతో తలపడుతున్న వైద్యుల కృషి సైనికులతో స‌మాన‌మ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపిన విష‌యాన్ని మంత్రి హరీశ్ గుర్తు చేశారు.

అనుచితం కాదంటూనే రాజకీయాలా ..

దేశ ర‌క్ష‌ణ విష‌యంలో ప్ర‌భుత్వాల‌ను విమర్శించడం అనుచితం కాద‌ని జేపీ చెప్పిన విషయాన్ని ఊటంకిస్తూ మంత్రి హరీశ్ నిల‌దీశారు. అలాంట‌ప్పుడు మాన‌వాళి మ‌నుగ‌డ‌కే స‌వాలుగా మారిన క‌రోనా విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. క‌రోనాపై విమ‌ర్శ‌లు చేయ‌డం అంటే దేశ భ‌ద్ర‌త విష‌యంలో చుల‌క‌న‌గా మాట్ల‌డ‌టమేనని వ్యాఖ్యానించారు.

విమర్శించడం రాజనీతి అవుతుందా ?

జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు కొవిడ్​పై సైనికుల్లా పోరాడుతున్న వైద్యుల నైతిక స్థైర్యం దెబ్బ‌తీస్తుంద‌ని ఉద్భోదించారు. క‌రోనా విష‌యంలో రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌డం రాజ‌నీతి అవుతుందా అని ప్రశ్నించారు.

దేశ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి ఇలా అంటారా ?

దేశ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన వారే వైద్యుల కృషిని తక్కువ చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా జేపీ నడ్డా మాట్లాడారని హరీశ్‌ అన్నారు. సైనికుల నైతిక స్థైర్యం గురించి మాట్లాడేవారు వైద్యుల గురించి ఆలోచించరా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను వైద్యుల ఆత‌్మ‌స్థైర్యం దెబ్బ‌తీసే చ‌ర్య‌గా అభివ‌ర్ణిస్తూ ఈ అంశాన్ని జేపీ నడ్డా గుర్తు చేసుకోవాల‌ని మంత్రి హ‌రీష్ సూచించారు. ‌

ఇవీ చూడండి : మధ్యాహ్న భోజనంలో రాగి జావ.. మొలకలు.. బెల్లం

ABOUT THE AUTHOR

...view details