హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అమిర్నేని మోహన్‌కృష్ణ అమరావతిలో కాంట్రాక్ట్ వర్క్‌లు చేసేవాడు. శుక్రవారం ఎస్ఆర్నగర్ పరిధిలోని సన్నీ అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే బలవణ్మరనానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య - a man suicide with financial problems at sr nagar
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన అమిర్నేని మోహన్‌కృష్ణ హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని సన్నీ అపార్ట్మెంట్లో ఉరివేసుకుని బలవణ్మరనానికి పాల్పడ్డాడు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య