ETV Bharat / state

ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు - హన్మకొండలో ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. లష్కర్​ సింగారానికి చెందిన హారతి అనే యువతిని... షాహిద్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. గదికి వచ్చిన యువతిపై కత్తితో దాడి చేసిన షాహిద్... ఆమె గొంతు కోసి హతమార్చాడు.

murder
murder
author img

By

Published : Jan 10, 2020, 11:27 PM IST

హన్మకొండలో ప్రియురాలి గొంతుకోసి చంపిన ప్రియుడు

ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. నమ్మించి తన గదికి తీసుకెళ్లిన యువకుడు... ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండ రాంనగర్​లో ఈ దారుణం చోటు చేసుకుంది.

నమ్మించి గొంతు కోశాడు

స్థానిక మటన్ షాపులో పనిచేస్తున్న షాహిద్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. లష్కర్ సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థి హారతితో అతనికి పరిచయముంది. ఈ క్రమంలోనే రాంనగర్​లోని షాహిద్ అద్దె గదికి వెళ్లింది. అక్కడ వారిద్దరికి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాటమాటా పెరగడంతో షాహిద్... ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో హారతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ప్రేమ వ్యవహారమే కారణం...!

యువతిపై దాడి అనంతరం నిందితుడు షాహిద్​ స్థానిక పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. అదుపులో ఉన్న షాహిద్ నుంచి వివరాలు సేకరిస్తున్నామని... నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు వెల్లడించారు.

బాధితులను ఓదార్చన ఎర్రబెల్లి

విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మధ్యాహ్నం పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, స్థానిక ఎమ్మెల్యే, చీఫ్​ విప్​ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం అదుపులో ఉన్న షాహిద్​ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితులను వెంటనే ఉరితీయాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

ఇదీ చూడండి: గళమెత్తిన మహిళా లోకం.. ఎక్కడికక్కడ అరెస్టులు

Intro:Tg_wgl_03_10_yuvathi_murder_av_ts10077

Body:వరంగల్ లో ఓ యువతి దారుణ హత్యకు గురి అయింది.హన్మకొండలోని రంనాగర్ లో హారతి అనే అమ్మాయిని ఆమె ప్రియుడు సాహిథ్ కత్తి తో గొంతు కోసి చంపాడు. కాజిపేట కు చెందిన సాహిథ్ రంనాగర్ లో అద్దె నివాసంలో ఉంటున్నాడు. అయితే ఆరోజు లష్కర్ సింగరానికి చెందిన హారతి అనే యువతి అతని రూమ్ కు రాగా ఇద్దరి మధ్యలో గొడవలు కాగా గొంతు కోసి పారిపోయాడు. నిందుతుడు పోలీస్ లకు లొంగిపోయిన ట్టు సమాచారం. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు...స్పాట్

Conclusion:yuvathi murder
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.