తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి - దేవేందర్ నిషాద్

హైదరాబాద్ అంబర్​పేటలోని బూర్జుగల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ప్రమాదవశాత్తు వ్యక్తి జారి పడి మరణించాడు. మహారాష్ట్రకు చెందిన దేవేందర్ నిషాద్ మద్యం మత్తులో మూడో అంతస్థు నుంచి లిఫ్ట్ గుంతలో పడి మృతిచెందాడు.

తాగిన మైకంలోనే ప్రమాదవశాత్తు జారి పడి మరణించాడు : స్థానికులు

By

Published : Jul 14, 2019, 5:03 AM IST

అపార్ట్​మెంట్​ నిర్మాణానికి సంబంధించి మనోజ్​ కుమార్ అనే కాంట్రాక్టర్ తన పాత పరిచయంతో రెండు రోజుల క్రితమే దేవేందర్ నిషాద్​ను పనినిమిత్తం పిలిపించుకున్నారు. గత రాత్రి మద్యం సేవించిన నిషాద్ ఫోన్ మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు.
తాగిన మైకంలో నిషాద్ లిఫ్ట్ గుంతలో పడి మరణించినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన హైదరాబాద్​ అంబర్​పేటలోని బూర్జుగల్లిలో చోటుచేసుకుంది.

ఉదయం ఆరు గంటల సమయంలో జగదీష్ అనే వ్యక్తి గమనించి దేవేందర్ నిషాద్ కోసం గాలించారు. అప్పటికే దేవేందర్ నిషాద్ గుంతలో పడి మృతి చెందాడు. వెంటనే అపార్ట్​మెంట్ యాజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాగిన మైకంలో మూడో అంతస్థు నుంచి లిఫ్ట్ గుంతలో పడి వ్యక్తి మృతి

ఇవీ చూడండి : పీఎస్​ నుంచి తప్పించుకుని దొరికిపోయాడు

ABOUT THE AUTHOR

...view details