డాక్టర్ మార్కండేయులు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. చేతులు శుభ్రపరుచుకోవడం ఆవశ్యకతను వివరిస్తున్నారు. డాక్టర్ మార్కండేయులు కామినేనిలో ప్రొఫెసర్, పిల్లల వైద్యనిపుణునిగా పనిచేస్తున్నారు.
ఓ డాక్టర్ రోడ్డుపైకి వచ్చి.. శానిటైజర్ ఇచ్చి - శానిటైజర్
కరోనా నివారణలో భాగంగా ఓ వైద్యుడు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ చిరువ్యాపారస్థులకు, పోలీసులకు శానిటైజర్‌ను అందజేస్తూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. కరోనాకు మందులేదని ముందు జాగ్రత్త చర్యలే మేలని ఆయన వివరిస్తున్నారు.
ఓ డాక్టర్ రోడ్డుపైకి వచ్చి.. శానిటైజర్ ఇచ్చి
రోడ్లపై కూరగాయలు, పండ్లు విక్రయదారులకు, కొనుగోలు దారులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ వైరస్‌కు మందు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు తమతమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ... చేతులను ఎప్పటి కప్పుడు శానిటైజర్‌తో శుభ్ర పరుచుకోవాలని సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మంచి నీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: సీరియస్‌గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్