రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి
08:52 November 09
రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి
రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 2,51,188 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారి సంఖ్య 1,381కు చేరింది. 1,504 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2 లక్షల 30 వేల 568 మంది బాధితులు కరోనాని జయించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 16,449 మంది చికిత్స తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 250 మందికి వైరస్ సోకింది.
ఇదీ చదవండి:నీట్ తరహాలో నర్సింగ్ ప్రవేశ పరీక్ష..!