రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు - telangana corona cases news
08:44 December 13
రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 127 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 2,77,724కు చేరింది. మరో నలుగురు మరణంతో.. మృతిచెందినవారి సంఖ్య 1,493కు చేరింది.
కరోనా నుంచి తాజాగా 609 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం 2,68,601 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 5,546 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,630 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇవీచూడండి: 'నైలాన్ మాస్కులతో వైరస్ నుంచి అధిక రక్షణ'