ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ సెక్యులర్ సీఎం అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్లు సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 8 వేల మంది వీఐపీలు ఇఫ్తార్ విందుకు హాజరవుతారని హోంమంత్రి తెలిపారు. రంజాన్ పండగ సందర్బంగా రూ.16 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. వీటిని మసీదుల అభివృద్ధికి వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం సోదరులను రంజాన్లో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కుల, మతాలకు అతీతంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని అన్ని పండుగులను ప్రభుత్వ పరంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు జరగనున్న ఇఫ్తార్ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్లతో పాటు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్లు పరిశీలించారు.
ఇఫ్తార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
Last Updated : Jun 2, 2019, 7:22 AM IST