కాంగ్రెస్ నుంచి తెరాసలోకి మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలు అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నేడు లేదా రేపు ప్రత్యేకంగా సమావేశమై కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేసేందుకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. తదనంతరం సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి లేఖ అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు ఈ సమాచారం అందడంతో అప్రమత్తమైంది. సభాపతికి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీకి రాజీనామా చేసినవారు కాక మిగిలిన ఎమ్మెల్యేలు తెరాసవైపు వెళ్లకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
తెరాసలో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం! - kcr
కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. నేడు లేదా రేపు ప్రత్యేకంగా సమావేశమై తెరాసలో విలీనం చేసేందుకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. పార్టీ విలీనానికి అవసరమైన సంఖ్యా బలం కూడా వీరికి ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు(పినపాక), హరిప్రియ(ఇల్లందు), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), సురేందర్(ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్ రెడ్డి(పాలేరు), వనమా వెంకటేశ్వర్రావు(కొత్తగూడెం), సుధీర్ రెడ్డి(ఎల్బీనగర్), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్), బీరం హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి) ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరుతామని ప్రకటించారు. మరి కొందరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. విలీనానికి 13 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా... దానికి అవసరమైన సంఖ్యాబలం ఈ వర్గానికి చేకూరినట్లు తెలిసింది.
ఇవీ చూడండి: బీసీ గురుకులాల్లో కొలువుల పండగ