ఈటీవీ భారత్, ఈనాడు, ఈటీవీ తెలంగాణలో నేడు ప్రచురితమైన 'ఆరుగురు పిల్లలు... ఆకలి దప్పులు' కథనానికి స్పందన వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ దూది రామె భర్త గత నెలలో చనిపోయాడు. వారికి ఆరుగురు సంతానం. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఆరుగురు పిల్లలను పోషించడం ఆమెకు కష్టంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యంతో కడుపు నింపుకుంటున్నారు.
ఆమె పడుతున్న ఇబ్బందులను ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్ ప్రచురించడంతో భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ స్పందించారు. వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆమె కుటుంబ పరిస్థితిని పరిశీలించాలని చర్ల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలన్నీ అందించామని స్థానిక అధికారులు తెలిపారు. దీంతోపాటు వారికి కావలసిన నిత్యావసర వస్తువులు కూరగాయలను ఈరోజు ఉచితంగా పంపిణీ చేశారు. ఆరుగురు పిల్లల సంరక్షణకు ప్రభుత్వం నుంచి రావలసిన పథకాలన్నీ అందించాలని... వారికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఐటీడీఏ పీవో గౌతమ్ అధికారులను ఆదేశించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కదిలొచ్చిన యంత్రాంగం - eenadu
ఈటీవీ భారత్ ప్రచురించిన 'ఆరుగురు పిల్లలు... ఆకలి దప్పులు కథనానికి స్పందన లభించింది. కట్టుకున్న వాడు కాలం చేయడం వల్ల రోజూ కూలీ చేసుకుంటూ ఆరుగురు పిల్లల్ని పోషిస్తోంది ఓ మహిళ. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతోంది. ఈటీవీ భారత్ ఆమె కష్టాలపై కథనాన్ని ప్రచురించగా... వారిని ఆదుకునేందుకు భద్రాచలం ఐటీడీఏ పీవో ముందుకొచ్చారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కదిలొచ్చిన యంత్రాంగం
ఇవీ చూడండి: ఆరుగురు పిల్లలు.. ఆకలిదప్పులు
Last Updated : Apr 26, 2020, 11:56 PM IST