తెలంగాణ

telangana

ETV Bharat / state

వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు - vasantha paksha payukta sriramanavami thirukalyana bramhostaval in badrachalam

భద్రాచలంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోదావరి నదిలో తెప్పోత్సవం జరగాల్సి ఉండగా ఈ ఉత్సవాన్ని ఆలయం లోపలే నిర్వహించారు.

vasantha paksha payukta sriramanavami thirukalyana bramhostaval in badrachalam
వసంత పక్ష పయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

By

Published : Apr 6, 2020, 11:56 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయం బయట చేయాల్సిన ఉత్సవాలన్నీ లాక్ డౌన్​తో లోపలే నిర్వహిస్తున్నారు.

ఆదివారం భద్రాద్రి రామయ్యకు గోదావరి నదిలో తెప్పోత్సవం జరగాల్సి ఉండగా ఈ ఉత్సవాన్ని ఆలయం లోపలే నిర్వహించారు. ఆలయంలోని నిత్య కల్యాణ మండపం వద్ద ఒక పెద్ద పాత్రలో గోదావరి జలాలను ఆవాహనం చేసి తెప్పోత్సవం నిర్వహించారు. అర్చకులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.

వసంత పక్ష పయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

ఇదీ చదవండి:కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. ఇవి తింటే చాలు

ABOUT THE AUTHOR

...view details