భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజున స్వామి వారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
కూర్మావతారంలో దర్శనమిస్తోన్న భద్రాద్రి రామయ్య - bhadradri lord rama temple
భద్రాద్రి రాముడి సన్నిధిలో శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేడు రామయ్య తండ్రి కూర్మావతారంలో భక్తులను కనువిందు చేస్తున్నాడు.
కూర్మావతారంలో దర్శనమిస్తోన్న భద్రాద్రి రామయ్య
కూర్మావతార రామయ్యను ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు తీసుకువచ్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు తిరుప్పావై, 200 పాశురాలను పారాయణం చేస్తున్నారు.
మధ్యాహ్నం స్వామి వారిని తిరువీధుల్లో ఊరేగిస్తారు. కూర్మావతార రామయ్యను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.