భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజే ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
మత్స్యావతారంలో కనువిందు చేస్తున్న భద్రాద్రి రాముడు - భద్రాద్రి రాముడు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మొదటి రోజైన నేడు రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
ఆలయ ఈవో నరసింహులు బేడా మండపంలో వేదపండితులకు, అర్చకులకు దీక్ష వస్త్రాలు అందించారు. అనంతరం వేద పండితులు, ఆళ్వారులు స్వామివారి ఎదుట తిరుప్పావై, 200 పాశురాలను పారాయణం చేశారు.
మధ్యాహ్నం పూట కోలాట నృత్యాలు,సకల రాజలాంఛనాల నడుమ.. మత్స్యావతారంలో ఉన్న రామయ్య తండ్రిని తిరువీధుల్లో ఊరేగించనున్నారు.
- ఇదీ చూడండి : మహాదివ్య పుణ్యక్షేత్రంగా.. యాదాద్రి..!