తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 10:29 AM IST

Updated : Mar 22, 2020, 10:38 AM IST

ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ

ఉమ్మడి ఖమ్మంలో నిత్యం జనంతో రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బస్సు ప్రయాణ ప్రాంగణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో భూగర్భ ఉపరితల గనులు మూతపడ్డాయి.

The Janata curfew in khammam
ఉమ్మడి ఖమ్మంలో జనతా కర్ఫ్యూ ప్రశాంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని భూగర్భ ఉపరితల గనులు కరోనా ప్రభావంతో మూతబడ్డాయి. నిత్యం కార్మికులతో కలకలలాడే గనుల ప్రాంతాలలో నిర్మానుష్యంగా మారాయి. బొగ్గులు తరలించే బోగీల ప్రాంతాల్లో జనతా కర్ఫ్యూ ప్రభావంతో ఎటువంటి పనులు జరగడం లేదు. సింగరేణి సంస్థ సెలవు ప్రకటించడం వల్ల బందును తలపించేలా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది.

ఉమ్మడి ఖమ్మంలో జనతా కర్ఫ్యూ ప్రశాంతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో

ఇల్లందు పట్టణంలో జనతా కర్ఫ్యూ కు అనూహ్య స్పందన లభిస్తుంది. ఉదయం నుంచి ప్రధాన రహదారులు, పెట్రోల్ బంక్ బస్టాండ్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్డు పైకి వస్తున్న ఒకరిద్దరు వాహనదారులను పోలీసులు రెవెన్యూ ఉద్యోగులు కౌన్సిలింగ్ చేస్తూ ఇళ్లలోకి పంపిస్తున్నారు.

వాహనాలు ఎక్కడికక్కడే

పట్టణంలోకి వస్తున్న భారీ వాహనాలను శివారు ప్రాంతంలోని పోలీసులు నిలిపివేశారు. పలు ప్రాంతాలలో పోలీసు వాహనం గస్తీ తిరుగుతూ పర్యవేక్షణ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ కూరగాయల మార్కెట్ జనాలు లేక వెలవెల బోతున్నాయి. బందును తలపించే విధంగా ప్రజలు కరోనా వైరస్ పై అవగాహనతో స్పందించడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

Last Updated : Mar 22, 2020, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details