తెలంగాణ

telangana

ETV Bharat / state

రాములోరి ఆలయంలో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం - badradri kothagudem district latest news

భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు.

Review Meeting on Brahmotsavams at Ramulori Temple at kothagudem district
రాములోరి ఆలయంలో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం

By

Published : Feb 25, 2020, 5:11 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ ఉత్సవాల్లో ఏప్రిల్ 2న జరిగే శ్రీరామనవమి, ఏప్రిల్ 3న జరిగే మహా పట్టాభిషేకం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీతారాముల కల్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇబ్బందులు కలిగితే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు.

రాములోరి ఆలయంలో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం

ఇదీ చూడండి :'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ABOUT THE AUTHOR

...view details