భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు, వామపక్షాల నాయకులు, బ్రిడ్జి సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల చెవుల్లో ప్రభుత్వం పువ్వులు పెడుతోందని..ఉద్యోగులంతా చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటసేపు ధర్నా చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు.
చెవిలో పూలు పెట్టొద్దని పూలతో నిరసన - భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మెుండి వైఖరికి నిరసనగా భద్రాచలంలోని , బ్రిడ్జి సెంటర్ వద్ద నిరసన తెలిపారు.
ప్రభుత్వ మెుండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ధర్నా