తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2021, 1:02 PM IST

ETV Bharat / state

అటవీ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం వడ్లగూడెంలో పోడు రైతులకు అటవీశాఖ సిబ్బందికి మధ్య ఉద్రిక్తత నెలకొంది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల నుంచి తరిమివేసే కుట్ర జరుగుతుందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జడ్పీఛైర్మన్‌ కోరం కనకయ్య అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడారు.

Podu farmers obstructing forest officials
అటవీ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం వడ్లగూడెంలో పోడు రైతులకు అటవీశాఖ సిబ్బంది మధ్య ఉద్రిక్తత నెలకొంది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల నుంచి తరిమివేసే కుట్ర జరుగుతుందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

బర్లగూడెం బీట్ చాతకొండ రిజర్వ్ ఫారెస్ట్​లో 127 హెక్టార్​ల భూమికి ట్రెంచ్ కొట్టేందుకు వచ్చిన అటవీశాఖ సిబ్బందిని స్థానిక పోడు రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జడ్పీఛైర్మన్‌ కోరం కనకయ్య అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడారు. 2005 కంటే ముందు నుంచి సాగుచేస్తున్న పోడు రైతుల జోలికి వెళ్లొద్దని అటవీ సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి:హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం

ABOUT THE AUTHOR

...view details