దసరాలోగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెరాస కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర రైతుబంధు సమన్వయకర్త పల్లా రాజేశ్వర్ రావు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్యటించిన పల్లా.. ఓటు నమోదు ప్రక్రియను సమీక్షించారు.
'దసరాలోగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి'
దసరా పండుగలోగా తెరాస ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర రైతుబంధు సమన్వయకర్త పల్లా రాజేశ్వర్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచంలో ఏర్పాటు చేసిన తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర రైతుబంధు సమన్వయకర్త పల్లా రాజేశ్వర్ రావు
భద్రాచలం నియోజకవర్గంలో సుమారు 5వేలకు పైగా ఓటర్లున్నారని, తెరాస నేతలు, కార్యకర్తలు ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని పల్లా సూచించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు తెలియజేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర కార్యదర్శులు మధు, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :తితిదే ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి