రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు స్వీకరించారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 3 మొక్కలను నాటారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులకు గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు.
గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన రేగా కాంతారావు - గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన రేగా కాంతారావు వార్తలు
గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మొక్కలను నాటారు. మంత్రి పువ్వాడ, ఎంపీ నామ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులకు గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు.
గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన రేగా కాంతారావు
హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో వన సంపద పెరిగిందని కాంతారావు పేర్కొన్నారు. హరితహారంతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు ఓ ఛాలెంజ్ విసిరిందన్నారు. పినపాక నియోజకవర్గంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 4న తెరాస విస్తృత స్థాయి సమావేశం