తెలంగాణ భవన్లో ఈనెల 4న తెరాస విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యలను, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లను, రాష్ట్ర కార్కొరేషన్ల ఛైర్మన్లను, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులను రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం 4 గంటల దాకా కొనసాగనుంది. భేటీలో పాల్గొనే వారికి మధ్యాహ్నభోజనం కూడా తెలంగాణ భవన్లోనే ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చూడండి: డ్రగ్స్ మత్తులో కారుతో యువకుల హల్చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు